వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జపాన్ న్యూక్లియర్ ప్లాంట్‌లో విస్పోటనం, పొంచి ఉన్న అను ప్రమాదం

By Pratap
|
Google Oneindia TeluguNews

Japan Nuclear Plant
టోక్యో: జపాన్‌లోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో భారీ విస్పోటనం సంభవించింది. దీంతో దేశవ్యాప్తంగా అణు ప్రమాదంపై అప్రమత్తం చేశారు. సునామీ, భూకంప ప్రభావంతో చతికిలపడిన జపాన్‌ను న్యూక్లియర్ ప్రమాదం మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. టోక్యోకు ఉత్తరంగా 250 కిలోమీటర్ల దూరంలోని ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో విస్పోటనం సంభవించింది. దీంతో ప్రజలు అణు ధార్మిక ప్రభావానికి లోనయ్యే ప్రమాదం ఉంది.

ప్లాంట్ విస్పోటనంతో వెలువడిన అణు ధార్మికతకు నలుగురు ప్రమాదానికి గురయ్యారు. ప్లాంట్ పది కిలోమీటర్ల పరిధిలో 45 వేల మంది నివసిస్తున్నారని, వారందరినీ ఖాళీ చేయస్తున్నామని జపాన్ అధికారులు చెప్పారు. ప్రధాని నోవాటో కాన్ సంఘటనా స్థలాన్ని శనివారం ఉదయం హెలికాప్టర్‌ ద్వారా సందర్శించారు. భారీ విస్పోటనం కారణంగా ప్రధాన భవంతి, ప్రహరీగోడలు పేలిపోయాయి. ప్రధానమైన ప్లాంట్ భూకంపానికి ధ్వంసం కావడంతో కూలింగ్ వాటర్ స్థాయిలు పెద్ద యెత్తున పడిపోయి ఈ ప్రమాదం సంభవించింది. రియాక్టర్ కరిగిపోవడంతో కూలింగ్ వాటర్ నష్టం వాటిల్లింది. ప్రజలు తమ శరీరం అణు ధార్మికతకు గురి కాకుండా చూసుకుంటూ ముఖాలకు మాస్క్‌లు, తడి తువ్వాళ్లు కప్పుకున్నారు.

English summary
A huge explosion hit a Japanese nuclear power plant on Saturday, triggering a 'nationwide atomic alert' in the country already reeling under the impact of giant tidal waves caused by a massive earthquake which has left 1,300 people dead or unaccounted for.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X