అక్రమాస్తులపై జగన్‌ను ప్రజలే నిలదీస్తారు: వి. హనుమంతరావు

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయంలో సన్న, చిన్నకారు రైతుల భూములను పెద్ద యెత్తున ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేరుతో సేకరించారని, వాటిని తిరిగి తీసుకుని పేదలకు ఇవ్వడం మంచిదని ఆయన అన్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లకు (సెజ్‌లకు) కేటాయించిన భూములపై సమీక్ష చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటనకు తమ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. సెజ్‌ల భూకేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడివారిపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినవారికి శిక్ష పడితేనే క్రమశిక్షణ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications