జగన్ వెళ్లిపోవడం వల్ల కాంగ్రెసుకు నష్టం లేదు: విలాస్ రావ్ దేశ్‌ముఖ్
National
oi-Pratapreddy
By Pratap
|
న్యూఢిల్లీ : మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వెళ్లిపోవడం వల్ల కాంగ్రెసు పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లదని కేంద్రమంత్రి విలాస్‌రావ్‌దేశ్‌ముఖ్ అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత సీనియర్ నేత వి. హనుమంత రావు నివాసంలో శనివారం విందుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సమస్యకు కేంద్రం త్వరలోనే పరిష్కారం చూపిస్తుందన్నారు. ఈ విందుకు లోక్‌సభ సభ్యుడు సర్వే సత్యనారాయణ, రాష్ట్రమంత్రి జానారెడ్డిలతో పాటు పలువురు కాంగ్రెస్‌నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ కోసం మద్దతు కూడగట్టడంలో భాగంగా హనుమంతరావు ఈ విందు సమావేశం ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నారు. తెలంగాణ కోసం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసేందుకు తెలంగాణ ప్రాంత మంత్రులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనికోసమే మంత్రి జానా రెడ్డి ఢిల్లీ వచ్చినట్లు తెలుస్తోంది.