వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
క్రికెట్ దౌత్యం, సెమీ ఫైనల్ మ్యాచుకు పాక్ ప్రధాని గిలానీ

గిలానీతో శనివారం అర్థరాత్రి రెండు గంటలపాటు జరిగిన సమావేశంలో గిలానీ మన్మోహన్ సింగ్ ఆహ్వానాన్ని మన్నించాలని నిర్ణయం తీసుకున్నారు. భారత ప్రధాని మన్మోహన్ ఆహ్వానం మేరకు పాకిస్తాన్, ఇండియాల మధ్య జరిగే సెమీ ఫైనల్ మ్యాచును చూడడానికి ఇండియా రావడానికి గిలానీ అంగీకరించారని అధ్యక్షుడి కార్యాలయం అధికార ప్రతినిధి ఫర్హతుల్లా బాబర్ చెప్పారు. మ్యాచు చూసేందుకు రావాలని మన్మోహన్ సింగ్ పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని, ప్రధాని గిలానీని ఆహ్వానించారు.
క్రికెట్ దౌత్యంలో భాగంగా గిలానీ రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటిస్తారని పాకిస్తాన్ వార్తాపత్రికలు రాశాయి. మ్యాచుకు ముందు గిలానీ మన్మోహన్ సింగ్‌ను అనధికారికంగా కలుస్తారని, మ్యాచు పూర్తయిన తర్వాత అధికారిక సమావేశం జరుగుతుందని రాశాయి. దౌత్య మార్గాల ద్వారా గిలానీ భారత పర్యటన గురించి భారత్‌కు తెలియజేశారు.