పెరిగిన రిక్రూట్‌మెంట్, నౌకరీ డాట్ కామ్ అధ్యయనంలో వెల్లడి

వాహన, ఐటీ, ఐటీఈఎస్ విభాగాల్లో ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చిలో వరుసగా 7, 6, 5 శాతం వృద్ధిరేటు నమోదు కాగా గత ఏడాది మార్చి నెలతో పోలిస్తే ఈ ఏడాది ఇదే నెలలో వరుసగా 27, 34, 10 శాతం వృద్ధి చెందినట్లు అధ్యయనం పేర్కొంది. 2008లో పోల్చుకుంటే ఈ ఏడాది మార్చి ఇండెక్స్ ఎక్కువడా ఉంది. ఐటిరంగంలో రిక్రూట్‌మెంట్ భారీగా ఉండగా... తర్వాతి రంగాలు వరుసగా ఆటో, టెలికం, బ్యాంకింగ్ రంగంలో కూడా ఉద్యోగుల రిక్రూట్‌మెంట్ బాగానే పుంజుకుందని నౌకరి డాట్‌కామ్ తెలిపింది. 2011-12 ఆర్థిక సంవత్సరం వ్యాపారానికి అనుకూలంగా ఉంటాయన్న ఉద్దేశ్యంతో అన్నీ రంగాలకు చెందిన పరిశ్రమలు రిక్రూట్‌మెంట్ చేపట్టాయి. పూనే, ఢిల్లీ -ఎన్‌సీఆర్, కోలకతా, బెంగళూరులో రిక్రూట్‌మెంట్ జోరందుకుంది.












Click it and Unblock the Notifications