జగన్‌పై పోటీకి కందుల రాజమోహన్ రెడ్డిని బుజ్జగిస్తున్న కాంగ్రెసు
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: కడప జిల్లా సీనియర్ రాజకీయ నాయకుడు కందుల రాజమోహన్ రెడ్డి కడప జిల్లా పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేస్తారని దాదాపుగా ఖరారు అయిపోయింది. అభ్యర్థిని బహిరంగంగా ప్రకటించడమే మిగిలి ఉంది. ఈ సమయంలో కందుల రాజమోహన్ రెడ్డి పోటీపై పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. కందుల సన్నిహితులు, బంధువులు కడప పార్లమెంటు నుండి పోటీ చేయవద్దని వారించారు. ఈ నేపథ్యంలో ఆయన వెనక్కి తగ్గినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే కందుల సోదరుడు శివానంద రెడ్డి మాత్రం పోటీ చేయాలని యోచిస్తున్నారు.
అయితే కందుల రాజమోహన్ రెడ్డి వెనక్కి తగ్గినట్లుగా కనిపించడంతో జిల్లాకు చెందిన మంత్రులు అహ్మదుల్లా, డిఎల్ రవీంద్రారెడ్డి, ఎమ్మెల్యే వీరశివారెడ్డి తదితరులు కందులను బుజ్జగిస్తున్నట్లుగా తెలుస్తోంది. కడప నుండి పోటీ చేయాలని ఆయన వద్దకు వెళ్లి వారు కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో విరమించుకుంటే పార్టీ ఇరకాటంలో పడుతుందని పార్టీలో కూడా కందుల భవిష్యత్తుకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కాగా కందులను పోటీ చేయవద్దని టిడిపి బుజ్జగించినట్లుగా తెలుస్తోంది.
Congress ministers, MLAs were requesting Kadapa district political leader Kandula Rajamohan Reddy to contest from Kadapa or join in Congress party. The allegations were revealed that he may not interest for contest.
Story first published: Thursday, April 7, 2011, 11:27 [IST]