గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాసుకు తనయుడి షాక్: వైయస్ జగన్ పార్టీలోకి మంత్రి కుమారుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kasu Venkata Krishna Reddy
గుంటూరు: మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి కుమారుడు మహేష్‌రెడ్డి త్వరలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. తొలి నుంచి ఆయన జగన్ పక్షంలో చేరేందుకు ఉత్సాహం ప్ర దర్శిస్తూ వచ్చారని తెలుస్తోంది. అయితే తండ్రి మంత్రిగా ఉండటంతో కొన్నాళ్ల పాటు ఊగిసలాట ధోరణి అవలంబించారు. చివరకు జగన్ వైపే వెళ్లేందుకు నిర్ణయించుకున్న మహేష్‌రెడ్డి కడపలో ఆ పార్టీ తరపున ప్రచారం నిర్వహించేందుకు గురువారం బయల్దేరి వెళ్ళారు.

త్వరలో అనుయాయులతో సమావేశం నిర్వహించి జగన్ పార్టీలో చేరిక వి షయం అధికారికంగా ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో మంత్రి కాసు పరిస్థితి ఇరకాటంలో పడింది. మంత్రిగా ఆయనకు ఏ జిల్లా ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించకపోవటంతో పాటు, కడప ఎన్నికలకు కూడా కాసును పార్టీ దూరంగా ఉంచింది. సీం కిరణ్‌కుమార్ రెడ్డి కొలువులో గుంటూరు జిల్లా నుంచి నలుగురు మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తుండగా, కాసు మినహా మిగతా ము గ్గురు మంత్రులు కడపలోనే ఉండి కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారు.

మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కడప జిల్లా ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంత వరకు కడప గడపలో మంత్రి కాసు అడుగుపెట్టకపోవటం విశేషం. తనకు పార్టీ బాధ్యతలు అప్పగించనందువల్లే కడపలో అడుగు పెట్టలేదని ఇటీవల కాసు ప్రకటించారు. మంత్రి కాసు గుంటూరు జిల్లాలో తన సామాజిక వర్గం జగన్ వైపుకు వెళ్లకుండా చూస్తారనే ఉద్దేశంతోనే సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి తన కొలువులో స్థానం కల్పించారు. అయితే ఆయన తన కుటుంబీకులనే కట్టడి చేయలేని పరిస్థితి ప్రస్తుతం ఎదురైంది. కాగా కాసు మాత్రం తాను కాంగ్రెస్‌ను వీడేది లేదని ప్రస్తుతానికి భరోసా ఇస్తున్నారు.

English summary
Minister Kasu Venkata Krishna Reddy son Mahesh Reddy will join in Ex MP YS Jaganmohan Reddy's YSR Congress party soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X