ఎల్ అండ్ టీ లాభం రూ. 1,686.21 కోట్లు

ఇందులో అత్యధికశాతం ఇంజనీరింగ్, నిర్మాణ విభాగాల నుంచి వచ్చినదేనని, గతంలోకంటే ఈ విభాగాల నుంచి 12.85 శాతం అధికంగా రూ.13,664.31 కోట్లు రాబట్టగలిగామని ఎల్ అండ్ టీ తెలిపింది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాలలోనూ 1.32 శాతం వృధ్ధిరే టు నమోదు చేసి రూ.1,001.39 కోట్లు సాధించగలిగామని వివరించింది. అయితే 2010-11 ఆర్థిక సం వత్సరం మొత్తంగా చూస్తే..నికర లాభాల్లో 9.54 శాతం వాటాను కోల్పోయామని తెలిపిం ది. దీంతో 2009-10లో రూ.4,375.52 కోట్లున్న నికర లాభం 2010-11లో రూ.3,957.89 కోట్లకు దిగజారింది. ఇదిలావుంటే తాజా ఫలితాల నేపథ్యంలో బిఎస్‌ఈలోని ఎల్ అండ్ టీ షేర్ విలువ 5.83శాతం ఎగబాకింది.












Click it and Unblock the Notifications