బీహార్‌లో ఎపి టూరిస్టు బస్సు బోల్తా: ముగ్గురు ఆంధ్రుల మృతి
National
oi-Srinivas G
By Srinivas
|
పాట్నా: బీహార్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినఓ ఓ పర్యాటక బస్సు శుక్రవారం ఉదయం ఒకటి బోల్తా పడింది. ఎపికి చెందిన టూరిస్టు బస్సు బోద్ గయా నుండి ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడటంతో ముగ్గురు మరణించగా, మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను దగ్గరలోని మొహానియాలోని ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదం బీహార్‌లోని కైమూర్ జిల్లాలో చోటు చేసుకుంది. కాగా మృతి చెందిన ముగ్గురిలో ఇద్దరు విశాఖ వాసులు కాగా, ఒకరు కాకినాడ వాసి. కాగా ఈ ప్రమాదం ఉత్తరప్రదేశేలోని అలహాబాద్ వద్ద జరిగినట్టు కూడా వార్తలు వస్తున్నాయి.