జగన్‌కు సొంత ఇమేజ్ లేదు, తండ్రి ఇమేజ్‌తో రాజకీయం: శత్రుచర్ల
Districts
oi-Srinivas G
By Srinivas
|
విజయనగరం: వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి స్వతహాగా ఇమేజ్ లేదని విజయనగరం జిల్లా కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు శత్రుచర్ల విజయరామారావు సోమవారం విమర్శించారు. జగన్‌కు ఇమేజ్ లేకున్నప్పటికీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రాధాన్యతతో రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్ ఇమేజ్‌తో జగన్ రాజకీయం చేస్తున్నాడని అందరికీ అర్థం అవుతుందని అన్నారు.
జగన్‌తో వెళుతున్న వారంతా చోటా నాయకులే అని అన్నారు. అలాంటి నాయకులు జగన్‌కు మద్దతు పలకడం వల్ల కాంగ్రెసు పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. కాంగ్రెసుకు కార్యకర్తల బలం ఉందన్నారు. కాంగ్రెసు ఎప్పుడు ప్రజలు, కార్యకర్తలపై ఆధార పడి ఉంది.