హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజీనామాలతోనే తెలంగాణ: జీవన్, డిసిసి బిల్డింగ్ ఎక్కిన విద్యార్థులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jeevan Reddy
హైదరాబాద్‌/వరంగల్: కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేస్తే అధిష్టానం దిగి వచ్చి తెలంగాణ ప్రకటిస్తుందని కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ సూచించారు. తెలంగాణపై కాంగ్రెసుకు స్పష్టత లేక పోవడం వల్లే సందిగ్ధత నెలకొందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఆందోళనలు, దీక్షలు చేస్తే ఫలితం ఏముండదన్నారు. ప్రభుత్వాన్ని కూలగొట్టుకోవాలని ఏ పార్టీ కూడా భావించదు కాబట్టి రాజీనామాలు చేస్తే ఆమోదించే పరిస్థితి లేదన్నారు. టి-కాంగ్రెసు నేతలు చేసిన రాజీనామా డిమాండుకు కట్టుబడి ఉండాలని సూచించారు.

ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే కేవలం ఉప ఎన్నికలు మాత్రమే వస్తాయని అధికార పార్టీ నేతలు రాజీనామా చేస్తే తెలంగాణ వస్తుందన్నారు. తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలని అన్నారు. తెలంగాణకు కట్టుబడి ఉంటే రాజీనామాలే ఏకైక అస్త్రం అన్నారు. కాగా వరంగల్ జిల్లాలో కాంగ్రెసు ప్రజాప్రతినిధుల వైఖరిని నిరసిస్తూ కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన ఆరుగురు విద్యార్థులు డిసిసి భవనం ఎక్కారు. తెలంగాణపై స్పష్టత లేకుండా వస్తున్న టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని లేకుంటే తాము భవనంపై నుండి దూకుతామని హెచ్చరించారు.

English summary
Congress senior leader Jeevan Reddy demanded his party leaders that to resign for their posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X