వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యజర్వేద మందిరం రక్షణ విభాగం ప్రధానాధికారి ప్రధాన్ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sathya Saibaba
పుట్టపర్తి: పుట్టపర్తి సత్యసాయిబాబాకు చెందిన సంపద తరలింపులో కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న యజర్వేదమందిర రక్షణ విభాగ ప్రధానాధికారి ప్రధాన్‌ను సోమవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి అతన్ని విచారించారు. ఈ విషయాన్ని పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. కొడికొండ చెక్‌పోస్టువద్ద పట్టుబడిన నిందితులు హరీష్‌ నందాశెట్టి, సోహాన్‌శెట్టి, చంద్రశేఖర్‌ఇచ్చిన సమాచారం మేరకు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రశాంతి నిలయంలో డబ్బు సంచి తెచ్చి కారులో ఉంచిన వ్యక్తి సెక్యూరిటీ ప్రధాన అధికారి ప్రధానే అని నిందితులు వెల్లడించినట్లు సమాచారం.

పట్టుబడిన నగదు రూ.100, 500, 1000 నోట్ల కట్టల రూపంలో ఉంది. రూ.1000 నోట్ల కట్టలపై హైదరాబాదు 44 అన్న నంబరు ఉంది. మిగిలిన నోట్ల కట్టలు ఏ బ్యాంకుకు చెందినవో వివరాలు వెల్లడించేందుకు డీఎస్పీ కృష్ణ నిరాకరించారు.తమిళనాడు లోని నార్తార్‌ఖాడ్‌కు చెందిన చంద్రశేఖర్ ట్రస్టు సభ్యుడు శ్రీనివాసన్‌ వద్ద 2 నెలలుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి అంత డబ్బు ఎక్కడిది? ఎవరు ఇమ్మంటే ప్రశాంతి నిలయంలోని సత్యసాయి క్యాంటీన్‌ వద్ద బెంగళూరుకు చెందిన సోహాన్‌శెట్టికి ఇచ్చారు? తదితర విషయాలపై పోలీసులు విచారిస్తున్నారు.

కొడికొండ చెక్‌పోస్టు వద్ద నగదుతో పట్టుబడిన హరీశ్‌నందాశెట్టి, సోహాన్‌శెట్టి బెంగళూరులోని సత్యనారాయణ కన్‌స్ట్రక్షన్స్‌లో పనిచేస్తున్నారు. సోహాన్‌శెట్టి, ట్రస్టు సభ్యుడు శ్రీనివాసన్‌ మధ్య సాన్నిహిత్యమున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా విచారణ చేశారు. ట్రస్టుకు సంబంధించి కీలకమైన వ్యక్తులను విచారణకు పిలిపించటానికి వీలుగా పోలీసులు నోటీసులను సిద్ధం చేస్తున్నారు. చట్టపరంగా ఎలాంటి విధానాలను అవలంభించాలనే అంశాలను పరిశీలిస్తున్నట్లు ఎస్పీ షానవాజ్‌ ఖాసిం చెప్పారు. ట్రస్టులో కీలకంగా ఉన్న ఇద్దరికి నోటీసులు జారీ చేయనున్నట్లు చెప్పారు. సత్యసాయి ట్రస్టు ఉద్యోగులు ముగ్గురిని అదుపులోకి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు.

English summary
Puttaparthi Sathya Sai Baba's yajarveda Mandir chief security officer Pradhan was arrested by police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X