శ్రీనివాసన్‌కు ఆరు గంటల పాటు ప్రశ్నలు, సత్య సాయి ట్రస్టుకు నోటీసు

శ్రీనివాసన్ విచారణకు సంబంధించిన వివరాలను తాను రేపు మంగళవారం వెల్లడిస్తానని ఆయన చెప్పారు. ట్రస్టు మరో సభ్యుడు రత్నాకర్‌ను పోలీసు అధికారులు ఇప్పటికే విచారించారు. సత్య సాయిబాబాకు సంబంధించిన 35 లక్షల రూపాయల సంపదను తరలించిన కేసులో పోలీసు అధికారులు వారిని విచారించారు.
కాగా, రాష్ట్ర ప్రభుత్వం శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టుకు సోమవారం నోటీసులు జారీ చేసింది. గత ఐదేళ్ల ట్రస్టు ఆర్థిక లావాదేవీలపై పది రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ట్రస్టుతో పాటు దాని అనుబంధ సంస్థల ఆర్థిక లావాదేవీలపై కూడా సమాచారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టుపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నోటీసులు జారీ చేసింది.