నాగం దీక్ష రేపే: టిడిపి నేత వేణుగోపాలాచారీ భేటీ

నాగం జనార్దన్ రెడ్డి దీక్షకు వేణుగోపాలాచారి మద్దతు ప్రకటించారు. తెలంగాణ కోసం తాను నాగం జనార్దన్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు. ఇన్నాళ్లు తటస్థంగా ఉంటూ వచ్చిన వేణుగోపాలాచారి నాగం జనార్దన్ రెడ్డిని కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. నాగం జనార్దన్ రెడ్డి దీక్షకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), తెలంగాణ జెఎసి మద్దతు ప్రకటించాయి. కాంగ్రెసు తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంత మంది నాయకులు కూడా ఆయన దీక్షకు మద్దతు చెప్పే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications