హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బుజ్జగింపులకు లొంగేది లేదు, హామీ కావాల్సిందే: వివేక్

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్‌: రాజీనామాలు చేయాలనే తమ నిర్ణయంపై పార్టీ నాయకత్వం బుజ్జగింపులకు లొంగేది లేదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ స్పష్టం చేశారు. రాజీనామాలు చేయనివారిని ప్రజలే చూసుకుంటారని ఆయన అన్నారు. మంత్రి కె. జానారెడ్డి నివాసం వద్ద ఆయన పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులతో కలిసి శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమ పార్టీ తెలంగాణ శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు ఒకే మాట మీద ఉన్నారని, ఈ విషయంలో మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తాము రాజీనామాలు చేస్తామని ఆయన చెప్పారు.

తెలంగాణపై సంప్రదింపులు జరగాలని, ఏకాభిప్రాయం కావాలని తమ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ఒత్తిడిలో అన్నారని ఆయన అన్నారు. అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా తీర్మానాలు చేశాయని, ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖలు ఇచ్చాయని, ఏకాభిప్రాయం సాధించాలనే ఆజాద్ మాటలు సరి కాదని ఆయన అన్నారు. రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నామని, ఎల్లుండి ఉదయం 11 గంటలకు పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో, శాసనసభ్యులు హైదరాబాదులో రాజీనామాలు చేస్తారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ చెప్పారు.

కొన్ని న్యూస్ చానెల్స్ తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మండిపడ్డారు. సమావేశానికి రానివారి గురించి ఎత్తుతూ మీడియా తమపై దుష్ప్రచారం చేస్తోందని పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం అన్నారు. సమావేశానికి వచ్చిన ఒక్క ఎమ్మెల్యే తప్ప మిగతా వారంతా రాజీనామాలకు సంసిద్ధత వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. రాజీనామాలకు సిద్ధపడినవారిని ప్రజలే చూసుకుంటారని ఆయన అన్నారు.

తెలంగాణ ఇవ్వండి, లేదంటే తమ రాజీనామాలను ఆమోదించాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు వివేక్ చెప్పారు. పార్టీ అధిష్టానం కూడా తమ రాజీనామాల నిర్ణయంపై ఆలోచన చేస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే తమ రాజీనామాలు అక్కడ ఉంటాయని ఆయన చెప్పారు. స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామాలు చేస్తామని ఆయన చెప్పారు. రాజీనామాలు చేయాలనే తమ నిర్ణయం విషయంలో వెనక్కి తగ్గేది లేదని పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా చెప్పారు.

English summary
Congress Telangana region MP G Vivek said that they are united and submit resignations on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X