ఆర్టీసి చైర్మన్ పదవికి రాజీనామా చేసిన ఎమ్మెస్సార్

ఇదిలా వుంటే, మొత్తం 15 మంది ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఇందులో 12 మంది కాంగ్రెసు పార్టీకి చెందినవారు, ముగ్గురు తెలుగుదేశం పార్టీకి చెందినవారు ఉన్నారు. రాజీనామాలు చేయని మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్‌లకు ఉస్మానియా విశ్వవిద్యాలంయ జెఎసి హెచ్చరికలు జారీ చేసింది. రాజీనామాలు చేయనివారి ఇళ్లపై దాడులు చేస్తామని సోమవారం హెచ్చరించింది. రెండు రోజుల పాటు తెలంగాణ జెఎసి తలపెట్టిన రెండు రోజుల బంద్‌కు సిపిఐ మద్దతు ప్రకటించింది. కేబుల్ ఆపరేటర్ల సంఘం కూడా మద్దతు తెలిపింది. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన తర్వాత రాజీనామా చేయాల్సిన అవసరం లేదని హైదరాబాదుకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు ఎం. శశిధర్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications