వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామా చేయని టి - ఎమ్మెల్యేలు 19 మందే

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామాలు చేసిన తెలంగాణ శాసనసభ్యల సంఖ్య సెంచరీకి చేరుకుంది. ఇప్పటి వరకు 19 మంది తెలంగాణ శాసనసభ్యులు మాత్రమే రాజీనామా చేయలేదు. ఇద్దరు బిజెపి శాసనసభ్యులు రాజీనామా చేయడంతో వారి సంఖ్య 21 నుంచి 19కి తగ్గింది. రాజీనామా చేయనివారిలో ఎక్కువ మంది హైదరాబాదుకు చెందిన శాసనసభ్యులు కావడం విశేషం. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ (ఆందోల్) రాజీనామా చేయలేదు. తెలంగాణపై తాను అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ఇది వరకే ప్రకటించారు. అందువల్ల ఆయన రాజీనామా చేసే అవకాశాలు లేవు. కాగా, హైదరాబాదుకు చెందిన మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ రాజీనామాలు చేయలేదు. వీరు రాజీనామాలు చేయడానికి నిరాకరిస్తున్నారు.

కాగా, కాంగ్రెసు శానససభ్యులు మణెమ్మ (ముషిరాబాద్), మర్రి శశిధర్ రెడ్డి (సనత్‌నగర్), రేగా కాంతారావు (పినపాక, ఖమ్మం జిల్లా), మిత్రసేన్ (అశ్వారావుపేట, ఖమ్మం జిల్లా), శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లుభట్టి విక్రమార్క (మథిర, ఖమ్మం జిల్లా) రాజీనామాలు చేయలేదు. వీరితో పాటు హైదరాబాదులోని నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడుగురు మజ్లీస్ శానససభ్యులు రాజీనామాలు చేయలేదు. వీరు రాజీనామా చేసే అవకాశాలు లేవు. మజ్లీస్ శాసనసభ్యులు కూడా రాజీనామాలు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభా పక్ష నేత ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. లోకసత్తా శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ (కూకట్‌పల్లి, హైదరాబాద్) రాజీనామా చేయలేదు. ఆయన రాజీనామా చేసే అవకాశాలు లేవు. కాంగ్రెసుకు చెందిన మల్కాజిగిరి శాసనసభ్యుడు ఆకుల రాజేందర్, సంగారెడ్డి శానససభ్యుడు జగ్గా రెడ్డి కూడా రాజీనామా చేయలేదు. తాను రాజీనామా చేయబోనని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు.

అలాగే, సిపిఎం శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి (మిర్యాలగుడా, నల్లగొండ జిల్లా) కూడా రాజీనామా చేయలేదు. సిపిఎం రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కావడంతో ఆయన రాజీనామా చేయకపోవచ్చు. అయితే, ఆయనపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. జూలకంటి రంగారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆందోళనకారులు మిర్యాలగుడాలోని సిపిఎం కార్యాలయంపై దాడి చేశారు. రాజీనామా చేసిన తెలంగాణ శాసనసభ్యులు సంఖ్య 97కు చేరుకుంది.

English summary
Till only 19 MLAs were not resigned. Two BJP MLAs resigned. Damodara Rajanarsimha will not resign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X