వారు చేస్తే మేమూ రాజీనామా చేస్తాం: జెసి దివాకర్

తెలంగాణపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి అభిప్రాయపడ్డారు. పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఉండేవారు పార్టీలో ఉంటారు. వెళ్లేవారు వెళతారని అన్నారు. తెలంగాణ అంశం పతాకస్థాయికి చేరిందన్నారు. ఈ అంశంపై కేంద్రం వెంటనే జోక్యం చేసుకొని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. ఒక నిర్ణయం ద్వారా అన్ని ప్రాంతాల వారిని సంతృప్తిపర్చడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్యను పరిష్కరిస్తేనే ఫలితం ఉంటుందన్నారు. సమైక్యాంధ్ర కోసం ఏ త్యాగానికైనా సిద్ధం అని పూతలపట్టు శాసనసభ్యుడు డాక్టర్ రవికుమార్ వేరుగా అన్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇచ్చే సమస్యే లేదన్నారు.