తెలంగాణ నేతలకు మంత్రి ప్రణబ్ ముఖర్జీ చీవాట్లు

రాజీనామాల ఉపసంహరణకు, ఇతర ప్రతిపాదనలకు తెలంగాణ నేతలను ఒప్పించడానికి మధ్యవర్తిగా వ్యవహరించాలని అధిష్టానం కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని కోరినట్లు చెబుతున్నారు. అందుకు ఆయన నిరాకరించారని తెలుస్తోంది. అయితే, తెలంగాణ అంశాన్ని తమ పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తోందని రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన కాంగ్రెసు సీనియర్ నాయకుడు కె. కేశవ రావు ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తెలంగాణపై పది, పదిహేను రోజుల్లో అధిష్టానం నిర్ణయం వెలువడుతుందని ఆయన అన్నారు. చర్చల కోసం హస్తినకు పిలిచి వారిని ఉట్టి చేతులతో హైకమాండ్ వెనక్కి పంపింది. సమైక్యాంధ్ర నినాదంతో తెలంగాణలో ఏ ఒక్కరు కూడా గెలవబోరని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేస్తే తాము రాజీనామాలు ఉపసంహరించుకుంటామని ఆయన అన్నారు.
తాము చిన్న రాష్ట్రాలకు అనుకూలమని పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ కూడా అన్నారని ఆయన చెప్పారు. వంద మంది రాజీనామా చేసిన తర్వాత శాసనసభలో ఒక ప్రాంతానికి మొత్తం ప్రాతినిధ్యమే లేదని ఆయన అన్నారు.