అనంతపురం: భగవాన్ శ్రీ సత్య సాయి బాబా స్థాపించిన సత్య సాయి ట్రస్టుకు ట్రాన్సుకో కార్యాలయం నుండి నోటీసులు అందాయి. సత్య సాయి ట్రస్టు ఆధ్వర్యంలో పుట్టపర్తిలో నడుస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు దాదాపు గత సంవత్సకాలంగా బకాయిలు చెల్లించనందున వెంటనే చెల్లించాలని ఆదేశిస్తూ ట్రాన్సుకో కార్యాలయం సత్య సాయి ట్రస్టుకు నోటీసులు జారీ చేసింది. గత కొన్నాళ్లుగా 3.35 కోట్ల రూపాయల బకాయిలు పేరుకు పోయాయని వాటిని వెంటనే చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.
కాగా సత్య సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీని ఇస్తోంది. అయితే కొద్దికాలంగా ప్రభుత్వం ట్రాన్సుకోకు బిల్లులు కట్టడం లేదు. ప్రభుత్వం కట్టాల్సిన సబ్సిడీ బిల్లులు కట్టక పోవడంతో బకాయిలు పేరుకు పోయాయి. ప్రభుత్వం బకాయిలు కట్టలేదని నోటీసులో ట్రాన్సుకో పేర్కొన్నట్లు తెలుస్తోంది.