విజయవాడ: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో వెళుతున్న కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులది రాజకీయ వ్యభిచారం అని విజయవాడ నగర తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దేవినేని ఉమా మహేశ్వర రావు ఆదివారం ఓ సమావేశంలో మాట్లాడుతూ విమర్శించారు. జగన్ పార్టీ ప్లీనరీలో 21 మంది శాసనసభ్యులు పాల్గొన్నారని, కాంగ్రెసు పార్టీ గుర్తుపై గెలిచి జగన్ పంచన ఉన్న శాసనసభ్యులపై కాంగ్రెసు పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతిని సానుభూతిగా చేసుకొని జగన్ సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారని దాడి వీరభద్రా రావు విమర్శించారు. తన తండ్రి మరణం ఓ కుట్ర అంటున్న జగన్ అందుకు సిబిఐ విచారణకు ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. భౌతికాయం ఉండగానే ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రయత్నాలు చేసిన జగన్ను ప్రజలు నమ్మె పరిస్థితి లేదన్నారు.