వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మనల్ని మనం చాలా హింసించుకున్నాం: కెసిఆర్

తన అభ్యర్థనను మన్నించి దీక్షలు విరమించాలని ఆయన విద్యార్థులను కోరారు. తెలంగాణ ఉద్యమం విద్యార్థుల భవిష్యత్తు కోసమే జరుగుతోందని ఆయన అన్నారు. దీక్షల ద్వారా ఆరోగ్యాలు పాడుచేసుకోవద్దని ఆయన సూచించారు. ఇప్పటికే మనల్ని మనం చాలా హింసించుకున్నామని, పదునైన వ్యూహాలతో రాజీలేని పోరాటం చేద్దామని ఆయన విద్యార్థులతో అన్నారు.
కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దీక్షలు పరామర్శించడానికి వచ్చిన తెలంగాణ ప్రజాఫ్రంట్ నేత గద్దర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. బయటివారికి లోనికి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. పోలీసుల తీరును గద్దర్ తప్పు పట్టారు. తెలంగాణ కోసం ఢిల్లీలో దీక్ష చేస్తానని ఆయన చెప్పారు.