వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ నేతలు, ఒయు విద్యార్థుల దీక్ష విరమణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress leaders
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు చేపట్టిన 48 గంటల దీక్షను గురువారం సాయంత్రం విరమించారు. ముంబై పేలుళ్ల నేపథ్యంలో జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందుగానే దీక్షలను విరమిస్తున్నట్లు వారు తెలిపారు. తెలంగాణ యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ, మాజీ మంత్రి సరోజినీ పుల్లారెడ్డి వారి చేత దీక్ష విరమింపజేశారు. దీక్ష విరమణ సందర్భంగా గాయనీగాయకుల తెలంగాణ పాటల ఆలాపనకు కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రాజయ్య తదితరులు నృత్యాలు చేశారు. గేయ లయకు అనుగుణంగా వారు స్టెప్పులేశారు. తెలంగాణ విషయంలో తమ మధ్య విభేదాలు లేవని తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి కె. జానా రెడ్డి చెప్పారు. కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధులు బుధవారం దీక్షలు ప్రారంభించిన విషయం తెలిసిందే. వారు 36 గంటలపాటు దీక్ష చేశారు.

కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గత ఐదు రోజులుగా నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్న విద్యార్థులు కూడా దీక్షలు విరమించారు. దీక్షలు విరమించుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఇప్పటికే విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. దీక్షలు విరమించాలని కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా విద్యార్థులను కోరారు. తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్, తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్, విరసం నేత వరవరరావు, కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు మధుయాష్కీ, వివేక్ వారి చేత దీక్షలు విరమింపజేశారు.

English summary
Congress leaders and OU students withdraw fast
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X