వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఎమ్మెల్యేల రాజీనామాల తిరస్కరణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Madendla Manohar
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ్యుల రాజీనామాలను శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం దాదాపు 103 మంది శానససభ్యులు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ఆయన ఢిల్లీ పర్యటనకు బయలుదేరుతూ శనివారం రాత్రి తెలంగాణ శాసనసభ్యుల రాజీనామాలను తిరస్కరించారు. శాసనసభ్యులు భావోద్వేగాలకు గురై రాజీనామాలు చేశారని, అందువల్ల రాజీనామాలను తిరస్కరిస్తున్నానని స్పీకర్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. భావోద్వేగాలకు గురై రాజీనామాలు చేసినందున ఆమోదించలేమని ఆయన చెప్పారు. స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామాలు చేసినప్పటికీ వాటిని ఆయన తిరస్కరించారు.

అన్ని కోణాల నుంచి పరిశీలించిన తర్వాతనే తెలంగాణ శాసనసభ్యుల రాజీనామాలను తిరస్కరించినట్లు మనోహర్ చెప్పారు. లండన్ వెళ్లిన నాదెండ్ల మనోహర్ ఆగస్టు మొదటివారంలో తిరిగి హైదరాబాద్ వస్తారు. శాసనసభ్యులను ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడి రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పిన స్పీకర్ అందుకు భిన్నంగా రాజీనామాలను తిరస్కరించారు. రాజకీయ సంక్షోభాన్ని నివారించడానికే స్పీకర్ రాజీనామాలను తిరస్కరించినట్లు భావిస్తున్నారు. స్పీకర్ రాజీనామాలను తిరస్కరించిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు రేపు ఆదివారం సమావేశమవుతున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ శాసనసభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం తెలంగాణ శాసనసభ్యులు కూడా రేపు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటారు.

English summary
Assembly speaker Nadendla Manohar rejected Telangana MLAs resignations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X