వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎట్టకేలకు యడ్డీ రాజీనామా, రాజ్ భవన్‌కు నడక

By Srinivas
|
Google Oneindia TeluguNews

BS Yeddyurappa
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం మధ్యాహ్నం రాజ్ భవన్‌కు పాదయాత్రతో వెళ్లారు. సుమారు 75 మంది శాసనసభ్యులు వేలాది మంది అభిమానులతో తన ఇంటి నుండి రాజ్ భవన్‌కు నడుస్తూ వెళ్లి రాజీనామాను గవర్నర్ భరద్వాజ్‌కు సమర్పించారు. గవర్నర్ యడ్యూరప్ప రాజీనామాను ఆమోదించారు. కాగా యడ్యూరప్ప రాజీనామా సమయంలో తన బలప్రదర్శన చూపించడం విశేషం. రాజీనామాకు ముందు అధిష్టానంతో కాస్త పేచీ పెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. మొదట ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తేనే రాజీనామా చేస్తానని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఆయితే ఆ తర్వాత వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.

రాజీనామా సమర్పించిన అనంతరం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. తాను రాజకీయాల నుండి తప్పుకునేది లేదని స్పష్టం చేశారు. క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు. పార్టీ అదేశానుసారమే రాజీనామా చేశానని అన్నారు. తన హయాంలో ఎన్నో కొత్త పథకాలు ప్రవేశ పెట్టానని అన్నారు. మెట్రో, కొత్త అసెంబ్లీలు తుది దశలో ఉన్నాయని చెప్పారు. కొత్త ముఖ్యమంత్రికి అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పారు.

English summary
Yeddyurappa resigned for his post today evening. Governor Bharadwaj accepted his resignation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X