తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంచిది కాదు: దూకుడు షూటింగ్‌కు అడ్డంకిపై చిరు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
తిరుపతి: ఉద్యమాల పేరుతో కళాకారులను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి సోమవారం తన నియోజకవర్గ పర్యటన సందర్భంగా అన్నారు. శనివారం ప్రిన్స్ మహేష్ బాబు దూకుడు చిత్రీకరణ రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్‌లో జరిగిన అనంతరం తెలంగాణ వాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. దీనిపై చిరంజీవి స్పందిస్తూ కళాకారులు, వ్యక్తులపై దాడులు సరికావన్నారు. తిరుపతి నగరాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నగరంగా తీర్చి దిద్దుతానని అన్నారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.600 కోట్లతో తాగునీటి ప్రాజెక్టును తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

రూ.87 కోట్లతో స్వల్ప కాలిక ప్రాజెక్టును అమలులోకి తీసుకు వస్తామని అన్నారు. రూ.8 కోట్లతో కార్పోరేషన్ కార్యాలయం నిర్మిస్తామని అన్నారు. 50 ఎకరాల్లో డంపింగ్ యార్డును నిర్మిస్తామన్నారు. కాగా అంతకు ముందు యాదవ కాలనీలో తెలుగు మహిళా కార్యకర్తలు, మహిళలు చిరంజీవిని అడ్డుకున్నారు. తమకు అందుబాటులో ఉండటం లేదని, సమస్యలు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తూ చిరును అడ్డుకున్నారు. అభిమానులకు, తెలుగు మహిళా కార్యకర్తలకు తోపులాట జరిగింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

English summary
Tirupati MLA Chiranjeevi condemned Telanganites attack on prince Mahesh babu Dookudu shooting in Vikarabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X