హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఉద్యోగుల సకల జనుల సమ్మె వాయిదా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: ఈ నెల 17వ తారీఖు నుంచి తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి చేపట్టిన సకల జనుల సమ్మె వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రంజాన్ పండుగ ప్రారంభం కావడం, మరికొద్ది రోజుల్లో వినాయక చవితి పండుగలు ఉన్న నేపథ్యంలో సమ్మెను వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ముస్లిం పెద్దలు సైతం సమ్మె వాయిదా వేయాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్‌ను కలిసి కోరారు. అందుకు ఆయన జెఏసిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఉద్యోగ సంఘాలు సైతం ఉదయం జెఏసి వాయిదా వేసుకోవాలని కోరితే చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మధ్యాహ్నం కానీ, సాయంత్రం గానీ ఉద్యోగ సంఘాలు భేటీ అయి వాయిదాపై చర్చించే అవకాశం ఉంది. రాజకీయ జెఏసి భేటీ అవుతుంది. ఆ తర్వాత వాయిదా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. రంజాన్, వినాయక చవితి పండుగల దృష్ట్యా సెప్టెంబర్ 6కు సమ్మె వాయిదా వేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

English summary
Telangana Employees Sakala Janula Samme may postpone to September 6th due to Ramazan and Vinayaka Chaviti festivals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X