వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొద్దు శీను మరణ శిక్షకు అర్హుడు: అనంత కోర్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Moddu Sreenu
అనంతపురం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో ఆ కేసులో ప్రధాన నిందితుడు మద్దెలచెర్వు సూరి పేరును అనంతపురం జిల్లా కోర్టు గురువారం ప్రస్తావించలేదు. పరిటాల హత్య కేసులో ప్రధాన నిందితుల జాబితాలో మద్దెలచెర్వు సూరితో పాటు, పరిటాల రవిని హత్య చేసిన మొద్దు శీను, మరో నిందితుడు తగరకుండా కొండారెడ్డి ఉన్నారు. రవి హత్య కేసు ఆరేళ్లుగా కొనసాగుతోంది. కేసు కొనసాగుతున్న సమయంలో వీరు ముగ్గురు హత్యగావించబడ్డారు.

అయితే ఈ కేసులో మద్దెలచెర్వు సూరి పేరుతో పాటు తగరకండా కొండారెడ్డి పేరును కోర్టు ప్రస్తావించలేదు. ఇక హత్యకు పాల్పడ్డ మొద్దు శీను మరణ శిక్షకు అర్హుడు అని కోర్టు తీర్పు చెప్పింది. మొద్దు శీను చనిపోయినందున ఆ శిక్షను అమలు చేయలేక పోతున్నట్టు కోర్టు తీర్పు చెప్పింది. కాగా అభియోగాలు రుజువు కాలేకపోయినందు వల్ల నలుగురిపై కేసు కొట్టి వేసింది. మరొకరు అప్రూవల్‌గా మారటంతో ఆయనను నిర్దోషిగా ప్రకటించగా ఎనిమిది మందికి జీవిత ఖైదు విధించింది.

English summary
Ananthapuram district court did not talk about Maddelchervu Suri and Konda Reddy name in Paritala Ravi murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X