హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు వ్యూహం, ఆరు నెలల ముందే అభ్యర్థులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అప్పుడే సిద్ధమవుతున్నారు. ఆయన పార్టీ అభ్యర్థుల ఎంపికపై మాట్లాడుతున్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే శాసనసభ, పార్లమెంటుకు అభ్యర్థులను ప్రకటిస్తానని ఆయన చెప్పారు. ఆయన సోమవారం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. సకల జనుల సమ్మెపై, బాన్సువాడ ఉప ఎన్నికపై ఆయన వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆ మాటలు చెప్పారు. హైదరాబాదు నగర పాలక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులుండవని కూడా ఆయన చెప్పారు. పాతబస్తీలో మినహా మిగతా అన్ని సీట్లలో తామే గెలుస్తామని ఆయన దీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని 294 శానససభా నియోజకవర్గాలకు త్వరలోనే ఇంచార్జీలను నియమిస్తామని, వారి పనితీరును ఆరు నెలలకు ఒకసారి సమీక్షిస్తామని, అవసరమైతే ఇంచార్జీలను మారుస్తామని ఆయన చెప్పారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో కలిసిపోయిందని, వైయస్ జగన్‌కు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 45 రోజుల్లో పతనమవుతుందని ఆయన అన్నారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో ఆయన మూడు రోజుల పాటు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరు జిల్లాలోని మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

English summary
TDP president N Chandrababu Naidi said that he will declare candidates list before 6 months for ensuing election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X