వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థులపై హాస్టల్లో లాఠీచార్జీ: నలుగురికి తీవ్ర గాయాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్: హైదరాబాదులోని నిజాం కళాశాల హాస్టళ్లో పోలీసులు తమ జులుం ప్రదర్శించారు. హాస్టళ్లోకి పోలీసులు చొరబడి విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఓ విద్యార్థి కాళ్లూ చేతులు విరిగాయి. మరో విద్యార్థి ఛాతీభాగంలో తీవ్రమై గాయమైంది. మరో విద్యార్థి తలపై తీవ్రమై గాయమైంది. పవన్, నర్సింహులు, అంజి, వినోద్ అనే నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

హాస్టల్ గదుల్లో నిద్రిస్తున్నవారిపై కూడా పోలీసులు తీవ్రంగా కొట్టారు. విద్యార్థులు తమను రెచ్చగొట్టడం వల్లనే ఈ సంఘటన చోటు చేసుకుందని పోలీసులు అంటున్నారు. తమపై విద్యార్థులు రాళ్లు విసిరారని వారంటున్నారు. బయటి వ్యక్తులు లోపలికి వచ్చి రాళ్లు విసిరారని విద్యార్థులు చెప్పారు. అమాయకులైన విద్యార్థులను పోలీసులు కొట్టారని వారు చెబుతున్నారు. గాయపడిన విద్యార్థులను ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేసే వరకు తమ ఆందోళన సాగిస్తామని ప్రశాంత్ అనే విద్యార్థి చెప్పాడు.

గాయపడిన విద్యార్థుల ఫుటేజ్‌లు టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. విద్యార్థుల శరీరభాగాలపై తీవ్రమైన గాయాలు స్పష్టంగా కనిపించాయి. కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా ఉద్రిక్తంగా మారింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపైకి పోలీసులు టియర్ గ్యాస్ వదిలారు. దీనికి నిరసనగా రేపు మంగళవారం తెలంగాణవ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు విద్యార్థులు చెప్పారు.

English summary
Nizam college students severly injured in police lathicharge in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X