• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మకానికి సిద్దమంటూ.. ఆలోచనలో జపాన్ యాహు..!!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews
Yahoo
యాహు ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కంపెనీ. కానీ సెర్చ్ ఇంజన్ గూగుల్‌తో పోటీ పడలేక చివరకు తన ఆస్తులు అమ్ముకుంటున్న కంనీగా అభివర్ణిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా ప్రపంచంలో ఎక్కవగా హై ఫెర్పామెన్స్ బిజినెస్ చేసేటటువంటి జపాన్ యాహుని కొన్ని కారణాల వల్ల అందులో ఉన్న 35 శాతం షేర్‌ని విక్రయించనుందని సమాచారం.

గత కొన్ని నెలలుగా యాహు కంపెనీ బిజినెస్ పరంగా కొన్ని ఇబ్బందులకు గురి అవుతున్న విషయం అందరికి తెలిసిందే. ప్రపంచం మొత్తం మీద పడమర దేశాల బిజినెస్‌తో పొల్చుకుంటే తూర్పు దేశాలైన ఆసియా మార్కెట్ల బిజినెస్ కొంచెం ఉపశమనం ఇస్తుందని ఇటీవలే యాహు ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. అలెక్సా ర్యాంకింగ్స్ ప్రకారం యాహు జపాన్ సైట్ జపాన్ దేశంలో ఎక్కవ మంది చూసేటటువంటి వెబ్ సైట్‌గా పేరొందింది. అంతేకాకుండా కంపెనీ విడుదల చేసిన పబ్లిక్ డేటా ప్రకారం మార్చి నెలలో 1,762 మిలియన్ పేజీ వివ్స్ విజిటర్స్ యాహు సైట్‌ని సందర్శించినట్లు తెలిపారు.

జపాన్ హిస్టరీలోనే మొట్టమొదటి సారి ¥100 మిలియన్ స్టాక్ ఎక్సేంజిని దాటిన కంపెనీగా యాహు చరిత్రను సృష్టించింది. పోయిన సంవత్సరం సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ సెర్చ్ మార్కెట్‌ని ఎక్కవ ప్రభావితం చేసినప్పటికీ, సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలలో యాహుని తలదన్నలేకపోయింది. దీనిని బట్టి ఆసియా మార్కెట్‌లలో యాహు హై ఫెర్పామెన్స్‌ని ప్రదర్శిస్తుందని తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే గత వారం యూహూ న్యూస్‌కి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అందుకు కారణం జాక్ మా(ఛైర్మన్ ఆఫ్ చైనీస్ గెయింట్ ఆలీబాబా )మాట్లాడుతూ యాహుని అమ్మకానికి పెట్టినట్లైతే తాను కొనడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపాడు. ఐతే చైనా-అమెరికా మద్య సంబంధాలు సరిగ్గా ఉండకపోవడంతో ఈ డీల్ వర్క్ అవుట్ అయ్యే ప్రసక్తే లేదని నిపుణులు భావిస్తున్నారు. యాహుని కొనుగోలు చేసే రేసులో మైక్రోసాప్ట్ కూడా ఉందని మరో రూమర్ ఇంటర్నెట్లో సంచరిస్తుంది. మరి చివరకు యాహుని ఎవరు సొంతం చేసుకుంటారో తెలియాలంటే మరి కొన్నాళ్లు ఆగాల్సిందే.

ఇటీవలే యాహు క్యారోల్ బర్త్జ్‌ని కంపెనీ ఛీప్ ఎగ్జిక్యూటివ్‌ క్యారోల్ బర్త్జ్ గా నియమించి మూడు సంవత్సరాలు కాకముందే ఆమెను ఫైర్ చేయడం జరిగింది. యాహు ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా క్యారోల్ బర్త్జ్ తొలగించిన తర్వాత ఆమె స్దానంలో కొత్త సిఈవో వచ్చే వరకు 42సంవత్సరాలు వయసు కలిగిన ఛీప్ ఫైనాన్సియల్ ఆఫీసర్ తిమోతి మోర్స్ ఆ పదవి భాద్యతలను నిర్వర్తిస్తున్నారు.

English summary
Yahoo is rumored to be considering the sale of its stake in its high-performing business in Japan to help simplify a potential sale of the struggling firm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X