గాలి కేసు: శ్రీలక్ష్మి, రాజగోపాల్ అరెస్టుకు రంగం సిద్ధం?

ఇప్పటికే గాలి జనార్ధన్ రెడ్డి, మైనింగ్ ఎండి శ్రీనివాస్‌ల పేర్లు ఎ-1, ఎ-2లుగా పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే వారు అక్రమ మైనింగ్ జరుగుతుంటే సహాయ పడ్డారా లేక అక్రమాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నారా తదితర అంశాలను పరిశీలించి వారిని అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారిని ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలోని రాజగోపాల్ ఇంట్లో సిబిఐ అధికారులు సోదాలు చేసి కీలక పత్రాలు సేకరించిన విషయం తెలిసిందే. శనివారం శ్రీలక్ష్మి ఇంట్లోనూ సుమారు నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించిన సిబిఐ అధికారులు పలు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాలను సోమవారం కోర్టుకు సమర్పించనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications