హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోచారం ప్రమాణ స్వీకారం, విమర్శించిన తెలుగుదేశం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pocharam Srinivas Reddy
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ మధ్యాహ్నం తన కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయించారు. పోచారం ప్రమాణ స్వీకారానికి తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు హరీష్ రావు తదితరులు హాజరయ్యారు. కాగా అంతకుముందు ఆయన గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికలలో తెలంగాణ వాదం లేదని నిరూపించాలని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుట్ర పన్ని తనను ఓడించాలని చూశాయన్నారు. కానీ నియోజకవర్గ ప్రజలు తనను గెలిపించి తెలంగాణ ఆకాంక్షను తెలియజేశారన్నారు. కాంగ్రెసు, టిడిపి కుమ్మక్కు కావడం వల్లనే శ్రీనివాస్ గౌడ్‌కు ధరావత్తు దక్కిందన్నారు.

కాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారాన్ని తెలుగుదేశం పార్టీ తప్పు పట్టింది. తెలంగాణ కోసం ఓ వైపు ప్రజలు రాజీనామా డిమాండ్ చేస్తుంటే పోచారం ప్రమాణ స్వీకారం చేయడం బాధాకరమన్నారు. ఎన్నికలతో తెరాస పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. తెరాసకు తెలంగాణ ఏర్పాటు కావాలో ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవడం కావాలో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఎన్నికలను బహిష్కరించాలనే అంశానికి తాము ఎప్పటికీ కట్టుబడి ఉన్నామన్నారు.

English summary
Pocharam Srinivas Reddy sworn in as MLA today at Assembly. TDP senior leader Vijaya Rama Rao condemned Pocharam's attitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X