వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ పరిష్కారమయ్యేంత వరకు అంతే: నారాయణ

By Pratap
|
Google Oneindia TeluguNews

K Narayana
హైదరాబాద్: తెలంగాణ సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఆర్డీఎస్ లాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. తెలంగాణ సమ్మె ఆగినంత మాత్రాన ఉద్యమం ఆగిపోయిందనే మూర్ఖపు ఆలోచన మంచిది కాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టును నిర్మించి తీరాల్సిందేనని ఆయన అన్నారు. ముంపును తగ్గించే విధంగా డిజైన్ మార్చి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆయన సూచించారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని పార్టీలు ఆడుతున్న రాజకీయ క్రీడ మంచిది కాదని ఆయన అన్నారు.

రాష్ట్రంలో నెలకొన్న కరువుపై ప్రభుత్వం జాప్యం చేయకుండా రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కాలయాపన కమిటీలతో ప్రయోజనం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. వేలమంది పోలీసుల భద్రతతో సోంపేట థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు అనడాన్ని ప్రస్తావిస్తూ దమ్ముంటే ప్రాజెక్టును కట్టాలని ఆయన సవాల్ చేశారు. కర్నూలులో తమ పార్టీ కార్యకర్తలు చేయి చేసుకున్నారని జిల్లా వైద్యాధికారి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని, ఆలాంటిదేమీ జరగలేదని, విజువల్స్ తెప్పించుకుని విచారణ జరిపించాలని, తమ పార్టీ కార్యకర్తలు తప్పు చేశారని తేలితే పార్టీ నుంచి బహిష్కరిస్తామని ఆయన చెప్పారు. ఫిర్యాదు ఆధారంగా మాత్రమే చర్యలు తీసుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు.

English summary
CPI secretary K Narayana saiod that controversy like RDS will take place, till the Telangana issue is solved.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X