తీరిన నాగం కోరిక, ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం

తన రాజీనామాను ఆమోదింపజేయాలని కోరుతూ నాగం జనార్దన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఆయన పిటిషన్ కోర్టులో విచారణకు వచ్చే లోపలే స్పీకర్ రాజీనామాను ఆమోదించారు. తెలుగుదేశం పార్టీతో విభేదిస్తూ ప్రసన్నకుమార్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెంట నడుస్తున్నారు. దీంతో ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ స్పీకర్‌ను కోరుతూ ఫిర్యాదు చేసింది. అనర్హత పిటిషన్ పెండింగులో ఉండగానే స్పీకర్ ఆయన రాజీనామాను ఆమోదించింది.
అనర్హత పిటిషన్ పెండింగులో ఉండగా ప్రసన్నకుమార్ రెడ్డి రాజీనామాను ఆమోదించడం ప్రజాస్యామ్య విరుద్ధమని తెలుగుదేశం శాసనసభ్యుడు దూళిపాల నరేంద్ర చౌదరి విమర్శించారు. తన రాజీనామాను స్పీకర్ ఆమోదించడంపై నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications