హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముందే భానును విచారించిన సిబిఐ, హాజరైన శ్రీలక్ష్మి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sri Lakshmi
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసులో సిబిఐ అధికారులు సీనియర్ ఐఏఎస్ అధికారి భానును బుధవారం విచారించారు. గురువారం విచారణ కోసం తమ ముందు హాజరు కావాలని సీనియర్ ఐఏఎస్ అధికారులు భాను, శ్రీలక్ష్మిలకు సిబిఐ తాఖీదులు జారీ చేసింది. అయితే భానును గురువారం రమ్మని చెప్పినప్పటికీ ఆయన విజ్ఞప్తి మేరకు ఒకరోజే ముందే బుధవారం గోప్యంగా విచారించారు. భాను దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రత్యేక అధికారిగా పని చేశారు. కాగా గురువారం ఉదయం ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి సిబిఐ ముందు హాజరయ్యారు.

అయితే భానును విచారణ నిమిత్తం మరోసారి పిలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ఢిల్లీ అస్సాం భవనంలో కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఎమ్మార్ కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు. కాగా సాక్షి వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి కూడా గుట్టుచప్పుడు కాకుండా ఢిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరై వారి ప్రశ్నలకు సమాధానమిచ్చారని సమాచారం.

English summary
CBI officers enquired senior IAS officer Bhanu in Gali Janardhan Reddy OMC case on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X