వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎంతో టిడిపి నేతలు భేటీ, చర్చల అంశం సస్పెన్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Erran Naidu and Bojjala Gopalakrishna Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఎర్రన్నాయుడు, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. భేటీ అనంతరం బయటకు వచ్చిన వారిని మీడియా కదిలించగా ఏమీ మాట్లాడకుండానే కారెక్కి వెళ్లి పోయారు. మరీ మరీ అడగడంతో టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసే సమావేశంలో చర్చల సారాంశం చెబుతామని అన్నట్లుగా తెలుస్తోంది. సిఎంతో మాట్లాడటం, ఏమీ చెప్పకుండా వెళ్లడంతో అందరిలోనూ ఉత్కంఠ పెరిగింది. సాధారణంగా విపక్షాలు అధికార పక్ష ప్రముఖ నేతలను కలిసినప్పుడు ఎందుకోసం కలిశారో చెబుతారు.

తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేతలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టమని నిత్యం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. టిడిపి కూడా ఇటీవల పలు సందర్భాల్లో తాము శీతాకాల సమావేశాల్లో అవిశ్వాసానికి సిద్ధమని తమతో ఎవరు కలిసి వస్తారో ఎవరు రారో తేలిపోతుందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో జగన్ వర్గం ఎమ్మెల్యేలు కూడా తాము ప్రభుత్వానికి మద్దతిస్తూనే జగన్‌ను ఆపద సమయాల్లో కాపాడతామని చెప్పారు.

దీంతో వారు సిఎంతో అవిశ్వాస తీర్మానం పైన, వచ్చే సమావేశాల పైన చర్చించినట్లుగా పలువురు భావిస్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబు పైన వేసిన పిటిషన్ పైనా, తాజా రాజకీయ పరిణామాల పైనా చర్చించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. మొత్తానికి సిఎంతో టిడిపి నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా అందరిలో సస్పెన్స్ మిగిల్చింది.

English summary
TDP senior leaders Errannaidu and Bojjala GopalaKrishna Reddy met CM Kiran Kumar Reddy today. They did not talk with media after meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X