హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్, కెవిపి చెప్పినట్లే చేశా: సిఎంతో శ్రీలక్ష్మి గోడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sri Lakshmi
హైదరాబాద్: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి గనుల అక్రమాల్లో తనను అంతా కలిసి ఇరికించారని ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముందు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్, ప్రభుత్వ సలహాదారు కేవీపీ చెప్పినట్లే చేశానని ఆమె ఆయనతో చెప్పినట్లు తెలుస్తోంది. అప్పుడు అంతా కలసి నన్ను ఇరికించారని, ఇప్పుడు ఎవరూ తన గురించి మాట్లాడటం లేదని, తన కెరీర్‌లో ఇంత క్షోభ ఎప్పుడూ అనుభవించలేదని ఆమె చెప్పారు. కొన్ని రోజులుగా మనశ్శాంతి కరువైందని ఆమె గోడు వెళ్లబోసుకున్నట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు శ్రీలక్ష్మి ముఖ్యమంత్రిని సోమవారం కలుసుకోగలిగారు.

ఈ కేసులో తాను కూరుకుపోవడానికి ముఖ్య కారణమైన 'క్యాప్టివ్' అనే పదం జీవో ఎలా మాయమైందో తనకు తెలియదని కూడా చెప్పారు. ఓఎంసీ ఫైలు మిగిలిన వాటికంటే భిన్నంగా కొంత వేగంగా కదలడం నిజమేనని పరోక్షంగా చెప్పారు. శ్రీలక్ష్మి ఆవేదనను సీఎం సావధానంగా విన్నారు. 'సర్వీసులో ఉన్నప్పుడు ఇలాంటి వివాదాలు తప్పవు. అయినా, డోన్ట్ వర్రీ' అని అన్నట్లు తెలుస్తోందని వార్తలు వచ్చాయి.

English summary
IAS officer Srilakshmi met CM Kiran Kumar Reddy and blamed YSR and KVP for misdeeds in mining lease to Gali Janardhan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X