చిన్నపాటి పొరపాట్లను అపార్థం చేసుకోవద్దు: బొత్స

రాష్ట్రంలో 7 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తున్నాయని, ఆ తర్వాత 17 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తున్నాయని, కాంగ్రెసు పార్టీని గెలిపించేలా కృషి చేయాలని ఆయన అన్నారు. మన పనితీరును ఫలితాలు సూచిస్తాయని ఆయన అన్నారు. సిఎల్పీలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కార్యవర్గం అనుమతి తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
ఎమ్మెల్సీలను చిన్న చూపు చూస్తున్నారని ఎమ్మెవ్సీ సింగం బసవపున్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలకు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. శాసనసభ్యులు విధిగా జిల్లా కాంగ్రెసు కమిటీ (డిసిసి) కార్యాలయాలకు వచ్చేలా చూడాలని ఆయన సూచించారు.