వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎంకూ నాకూ యుద్ధమేమీ లేదు: బొత్స సత్తిబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
న్యూఢిల్లీ: తనకు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య యుద్ధమేమీ జరగడం లేదని, తాను వేరు - ముఖ్యమంత్రి వేరు కాదని ఆయన అన్నారు. ఇద్దరం వేర్వేరని తాము చెప్పామా అని ఆయన అడిగారు. తనపై ఎవరూ కుట్ర చేయడం లేదని ఆయన అన్నారు. సిఎంకు, తనకు మధ్య యుద్ధమేమీ లేదని, అది మీడియా సృష్టిస్తున్నదేనని ఆయన అన్నారు. తమ మధ్య విభేదాలు లేవని ఆయన అన్నారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరిన బొత్స పార్టీ రాష్ట్ర వ్యవహారాల కార్యదర్శి కృష్ణమూర్తితో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

విజయలక్ష్మి పేరు మారటాన్ని ప్రస్తావించగా - విజయలక్ష్మి పేరు ఒక్కటే తాను పంపించానని ఎలా అనుకుంటారని, ఆమె పేరుతో పాటు ఆశావహుల పేర్లను కూడా పంపిస్తామన్నారు. అందులో కులాల కూర్పును కూడా పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల పేర్లను అధిష్ఠానం ప్రకటిస్తుందన్నారు. తనకు తెలియకుండా జరిగిందని మీడియా ఎలా భావిస్తుందని ప్రశ్నించారు. ఏడులో ఒకటి ఎస్సీ స్థానం కాగా, మిగిలిన ఆరింటిలో ఐదు స్థానాలను రెడ్డి వర్గానికే ఇవ్వడంపై స్పందిస్తూ స్థానిక పరిస్థితులు, విజయావకాశాలను శాస్త్రీయంగా అంచనా వేసిన తర్వాతే అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు.

తెలంగాణ వారికి పార్టీ పదవుల్లో అవకాశం ఇవ్వాలని దామోదర్ రెడ్డి కోరడం తప్పు కాదని, తమ అభిప్రాయాలను అధిష్ఠానానికి చెబితే చూసుకుంటుందన్నారు. కాగా, ఉపఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను తానే అధిష్టానానికి పంపించానని బొత్స చెప్పారు. తమ అభ్యర్థుల గెలుపు కోసం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, చిరంజీవి, ఆయా ఎంపీలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేస్తారని వెల్లడించారు.

తెలంగాణ అయినా, సమైక్యాంధ్ర అయినా పరిష్కరించేది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. కాగా, ఉప ఎన్నికలు రిఫరెండం కాదని, అయితే, ఉప ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుని పనితీరు సమీక్షించుకుంటామన్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ ఫలితాలకు బాధ్యత ముఖ్యమంత్రిది కాబోదని, పార్టీదేనని చెప్పారు. మద్యం సిండికేట్లపై ఇప్పటికే చాలాసార్లు వివరణ ఇచ్చానన్నారు.

English summary
PCC president Botsa Satyanarayana said that he has no differences with CM Kiran kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X