వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మణిపూర్ మళ్లీ కాంగ్రెస్‌దే, 4వ స్థానంలో ఖుర్షీద్ భార్య

కాగా ఉత్తర ప్రదేశ్ లోని ములాయం సింగ్ యాదవ్ సొంత నియోజకవర్గం అయిన ఎటావాలో సమాజ్ వాది పార్టీ అన్ని స్థానాల్లోనూ ముందంజలో ఉంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ భార్య లూయీ ఖూర్షీద్ యుపి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఆమె నాలుగో స్థానంలో ఉన్నారు. కాగా కడపటి సమాచారం అందే సమయానికి ఉత్తర ప్రదేశ్‌లో ఎస్పీ 178, బిఎస్పీ 99, కాంగ్రెస్ 53, బిజెపి 57 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక మణిపూర్‌లో కాంగ్రెసు 9, తృణమూల్ కాంగ్రెసు 1, పంజాబ్ లో కాంగ్రెసు 2 స్థానాలు గెలుపొందింది.
కాగా కడపటి సమాచారం అందే సమయానికి మణిపూర్ లో కాంగ్రెసు పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంది. అక్కడ కాంగ్రెసు పార్టీ 29 స్థానాలలో గెలుపొంది, పన్నెండు స్థానాలలో ఆధిక్యంలో ఉంది. అరవై స్థానాలు కలిగిన ఇక్కడ కాంగ్రెసు మరోసారి అధికారంలోకి రానుంది.