హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

త్రివేది రైల్వే బడ్జెట్ వైపు చూస్తున్న ఆంధ్రప్రదేశ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Train
హైదరాబాద్: మంత్రి దినేష్ త్రివేది ప్రతిపాదించే రైల్వే బడ్జెట్ వైపు ఆంధ్రప్రదేశ్ చూస్తోంది. చాలా కాలంగా రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతోందనే అభిప్రాయం బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే ప్రాజెక్టులు సాధించే విషయంలో రాష్ట్రానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఒత్తిడి ఎదుర్కుంటున్నారు. రాష్ట్రానికి చెందిన పలు లైన్లు ఇప్పటికీ పెండింగులోనే ఉన్నాయి. రాష్ట్రానికి రైల్వే బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు అంటున్నారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి ఎన్ని కొత్త రైళ్లు వస్తాయనే ఆసక్తితో చూస్తున్నారు.

రాష్ట్రానికి అన్యాయం జరగలేదని తాను అనడం లేదని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. అన్యాయం జరిగితే నిరసన వ్యక్తం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. తమతో తెలుగుదేశం సభ్యులు కలిసి రావాలని ఆయన అన్నారు. కాంగ్రెసు సభ్యులు మైకుల వద్ద నిరసన తెలియజేస్తారు గానీ పార్లమెంటులో వ్యక్తం చేయరని నామా నాగేశ్వర రావు ఓ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు.

రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యం లభించేలా చూడడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంటు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు మినహా మిగతా పార్లమెంటు సభ్యులంతా హాజరయ్యారు. పార్లమెంటు సభ్యులు తమ తమ ప్రాధమ్యాలను వివరించారు. రైల్వే సహాయ మంత్రి మునియప్ప అప్పుడు వారికి హామీలు ఇచ్చారు. వరంగల్ జిల్లా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలనే డిమాండ్ కూడా ఉంది.

English summary
Andhra Pradesh is seeing towards Dinesh Trivedi's Railway Budget to be proposed in Parliament today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X