వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిపివో ఉద్యోగిని రేప్, హత్య: ఇద్దరికి మరణ శిక్ష

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pune Map
పూణే: ఓ కాల్ సెంటర్ ఉద్యోగినిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసినందుకు నిందితులకు ఓ కోర్టు సోమవారం మరణ శిక్ష విధించింది. ఐదేళ్ల క్రితం కాల్ సెంటర్ ఉద్యోగిని అయిన జ్యోతి కుమారి చౌదరిపై ఓ డ్రైవర్, అతని స్నేహితుడు అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. ఈ ఘటన 2007లో జరిగింది. డ్రైవర్ పురుషోత్తమ్ అతని స్నేహితుడు ప్రదీప్ ఇద్దరూ కలిసి పూణేలో ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు. పూణే కోర్టు గత శనివారం వారిని నిందితులుగా పేర్కొంది. కాగా ఈరోజు(మంగళవారం) నిందితులు ఇద్దరికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఇరవై రెండేళ్ల జ్యోతి కుమారి చౌదరి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని గోరక్‌పూర్ నుండి పూణేకి వచ్చింది.

2007 నవంబర్ 1వ తేదిన కాల్ సెంటర్‌కు చెందిన ఓ డ్రైవర్ అతని స్నేహితుడితో కలిసి ఆమెను పిక్ చేసుకోవడానికి వచ్చాడు. ఈమె నేరుగా వచ్చి కారులో కూర్చుంది. ఆమె ఆ సమయంలో ఓ స్నేహితురాలితో ఫోన్లో మాట్లాడుతోంది. దీంతో తాను ఎక్కే కారులో మరో వ్యక్తి ఉన్న విషయం గమనించలేదు. వారిద్దరూ జ్యోతిని ఎవరూ లేని ప్రదేశంలోకి తీసుకు వెళ్లారు. అక్కడ ఆమెపై ఇద్దరూ అత్యాచారం చేశారు. ఆ తర్వాత గొంతు పిసికి చంపేశారు. ఆమె మృతదేహం పూణే ఔట్ స్కర్ట్స్‌లో దొరికింది. ఆ తర్వాత నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

English summary
A Pune court sentenced to death on Tuesday a driver and his associate who had raped a woman of a call centre and then killed her in 2007.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X