వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts

దోచింది దాచుకోవడమే ఆశయం: జగన్ పార్టీపై బొత్స

ఉప ఎన్నికల ఫలితాలు ఆశాజనకంగా లేవని ఆయన అన్నారు. లోపాలను సరిదిద్దుకుని భవిష్యత్తు ఎన్నికలకు సమాయత్తమవుతామని ఆయన అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలకు బాధపడి మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఏదో మాట్లాడి ఉంటారని ఆయన అన్నారు. కోవూరులో మెరుగైన ఫలితం కోసం ప్రయత్నించామని ఆయన అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలను సమీక్షించుకుంటామని ఆయన అన్నారు. ఫలితాలకు తాను కూడా బాధ్యత వహిస్తానని ఆయన అన్నారు. మహబూబ్‌నగర్ అభ్యర్థి ఎంపికలో పొరపాటు చేశామని ఆయన అంగీకరించారు. తాము ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ఉంటే భవిష్యత్తులో సరిదిద్దుకుంటామని ఆయన అన్నారు. తాము తప్పుకోవడం, రాజీనామా చేయడం వంటి విషయాలపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు.
Comments
English summary
PCC president Botsa Satyanarayana lashed out at YS Jagan's YSR Congress party.
Story first published: Wednesday, March 21, 2012, 18:33 [IST]