వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిత్యానంతకు పిఠాధిపతుల షాక్, వ్యతిరేకంగా తీర్మానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nithyananda Swamy
బెంగళూరు/చెన్నై: మధురై పీఠాధిపతిగా ఎన్నికైన నిత్యానంద స్వామికి రాష్ట్రంలోని పలు పీఠాధిపతులు షాక్ ఇచ్చారు. మధురై ఆదీనం పీఠాధిపతిగా ఉన్న నిత్యానందను వెంటనే తొలగించాలని రాష్ట్రంలోని పదకొండు మంది పీఠాధిపతులు తీర్మానం చేశారు. ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాలని వారు ప్రభుత్వాన్ని కోరనున్నారు. నిత్యానందపై తీవ్రమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అలాంటి వ్యక్తిని పీఠాధిపతిగా కూర్చోబెట్టడం సరికాదని వారు ప్రభుత్వాన్ని కోరనున్నారు.

ఈ సందర్భంగా వారు మూడు తీర్మానాలు చేశారు. మధురై పీఠాధిపతిగా నిత్యానందను శాశ్వతంగా తొలగించాలని, ప్రధాన పీఠాధిపతిని కూడా తప్పించాలని, ప్రభుత్వమే జోక్యం చేసుకొని మధురపై పీఠాధిపతిని నియమించాలని సమావేశంలో ఆమోదించారు.

కాగా గతంలో నిత్యానందకు వ్యతిరేకంగా పదమూడు మంది పీఠాధిపతులు మాట్లాడారు. అయితే తీర్మానం చేసింది మాత్రం పదకొండు మంది పీఠాధిపతులే. మరోవైపు స్వామి నిత్యానంద ఈ విషయమై మాట్లాడుతూ.. తనను తొలగించాలని డిమాండ్ చేస్తున్న పీఠాధిపతులు అంతగా పెద్దగా లెక్కలోకి వచ్చే వారు కాదని చెబుతున్నారు. ముఖ్యమైన పీఠాధిపతులు తన నియామకాన్ని స్వాగతిస్తున్నారని చెప్పారు.

తాను ఏం చేసినా లోక కల్యాణం కోసమే చేస్తానని చెప్పారు. తనది న్యాయమైన నియామకం కాబట్టే కోర్టులో కూడా విజయం సాధించానని చెప్పారు. తాను మాస్టర్‌ను కాదని స్వామీజిని అన్నారు. నన్ను సరైన వారు ఎవరూ వ్యతిరేకించడం లేదన్నారు. కోర్టు కూడా తనకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేసిందన్నారు. దీంతో సత్యమేవ జయతే అని మరోసారి నిరూపితమైందన్నారు. తాను సత్యానందాన్నని లోక కల్యాణం కోసమే ఉన్నానని చెప్పారు.

కాగా నిత్యానంద స్వామికి తమిళనాడులో మధురై కోర్టులో మూడు రోజుల క్రితం ఊరట లభించిన విషయం తెలిసిందే. నిత్యానందకు వ్యతిరేకంగా దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని (పిల్‌ను) మదురై కోర్టు గురువారం డిస్మిస్ చేసింది. మదురై ఆధీనం జూనియర్ పీఠాధిపతిగా నిత్యానంద స్వామి నియామకాన్ని వ్యతిరేకించిన కంచి కామకోటి మఠం జయేంద్ర సర్వసతి స్వాములు కోర్టులో పిల్ దాఖలు చేశారు.

నిత్యానందను జూనియర్ పీఠాధిపతిగా నియమించడం పట్ల కంచి స్వామి అసంతృప్తితో ఉన్నారు. నిబంధనల ప్రకారం నిత్యానంద తలను వెంట్రుకలు లేకుండా క్షవరం చేసుకోలేదనేది ఆయన అభ్యంతరం. మదురై ఆధీనం ఆచారం ప్రకారం పీఠాధిపతులు తప్పకుండా తలపై వెంట్రులు ఉండకూడదు. అదే సమయంలో రుద్రాక్షలు ధరించాలి. కొన్నాళ్ల క్రితం నిత్యానంద అవాంఛనీయమైన వివాదంలో కూడా చిక్కుకున్నారు.

English summary
Eleven peethadhipathis passed resolution against the self-proclaimed godman Swami Nithyananda's appointment as the Madurai Adheenam peethadhipathi. Nityananda said, no one important peethadhipathi is opposing him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X