చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కంచి శంకరాచార్యపై కోర్టులో నటి రంజిత వాంగ్మూలం

By Pratap
|
Google Oneindia TeluguNews

Ranjitha
చెన్నై: కంచి శంకరాచార్య శ్రీ జయేంద్ర సరస్వతిపై తాను చేసిన ఫిర్యాదుకు సంబంధించి వాంగ్మూలం రికార్డు చేయడానికి సినీ నటి రంజిత బుధవారం కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు రావడం ఓ వారంలో ఆమె ఇది మూడోసారి. కంచి శంకరాచార్యపై వేసిన పరువు నష్టం దావాకు సంబంధించి చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ బుధవారం రంజిత వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. స్వామి నిత్యానందతో తనకు సంబంధాన్ని అంటగగడుతూ జయేంద్ర సరస్వతి తన ప్రతిష్టను దెబ్బ తీసేలా ప్రకటన చేశారని ఆమె ఆరోపించారు. విచారణను మెజిస్ట్రేట్ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజు రంజిత చెప్పిన సాక్షి వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేస్తుంది. ఆ తర్వాత కంచి పీఠాధిపతికి సమన్లు జారీ చేసే అవకాశాలున్నాయి.

స్వామి నిత్యానందతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రముఖ నటి రంజిత కంచి మఠం పీఠాధిపతి జయేంద్ర సరస్వతిపై కోర్టులో సోమవారం ఫిర్యాదు చేసింది. జయేంద్ర సరస్వతిపై ఆమె క్రిమినల్ డెఫమేషన్ కంప్లైట్‌ చేసింది. అయితే, ఆమె కోర్టుకు ఆలస్యంగా రావడంతో దానికి సంబంధించిన లాంఛనాలను శుక్రవారం పూర్తి చేయలేకపోయింది.

సోమవారంనాడు ఆమె సకాలంలో వచ్చి అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ విజి రవింద్రన్ ముందు తన పిర్యాదును దాఖలు చేసింది. తనకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై రంజిత శ్రీజయేంద్ర సరస్వతిపై ఆ ఫిర్యాదు చేసింది. తనకు బలమైన విశ్వాసం ఉందని, అందుకే తాను మతపరమైన సమావేశాలకు, ఇష్టాగోష్టులకు హాజరయ్యానని ఆమె తెలిపింది. తమిళనాడు, కర్ణాటకలో చేసిన ప్రవచనాలకు తాను నిత్యానంద శిష్యురాలిగా మారినట్లు ఆమె చెప్పింది.

శ్రీ జయేంద్ర సరస్వతి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిత్యానంద స్వామికి, తనకు మధ్య సంబంధాలు అంటగడుతూ మాట్లాడారని రంజిత చెప్పింది. కావాలనే కంచి మఠాధిపతి తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆమె అన్నది. తనపై చేసిన చెడు వ్యాఖ్యలకు తాను మస్తాపానికి, వేదనకు గురయ్యానని ఆమె చెప్పింది.

English summary
Actor Ranjitha Menon made her third visit to a city magistrate court in a week, and got her statements against the Kanchi Sankaracharya, Sri Jayendra Saraswathi, recorded by the chief metropolitan magistrate in connection with the defamation complaint lodged against the Kanchi seer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X