karunanidhi mulayam singh yadav akhilesh yadav mamata banerjee upa కరుణానిధి ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ యాదవ్ మమతా బెనర్జీ యుపిఏ
మమతను గెంటేశారు: ఎస్పీ, కాంగ్రెస్‌కు కరుణ షాక్

స్వతంత్రంగానే నిర్ణయం తీసుకుంటామని, గురువారం భారత బంద్ అనంతరం దీనిపై దృష్టి సారిస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌గోపాల్ యాదవ్ వెల్లడించారు. తృణమూల్ నిర్ణయం ప్రభావం ప్రభుత్వంపై తీవ్రంగా ఉంటుందని ఒక ప్రకటనకు సమాధానంగా చెప్పారు. కూటమి నుంచి బయటకు వెళ్లాలని తనకు తానుగా మమత బెనర్జీ ఎప్పుడూ కోరుకోలేదని.. బలవంతంగా పంపించి వేశారన్నారు.
యూపిఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీని దారికి తెచ్చుకోవడానికి కాంగ్రెసు పార్టీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. తృణమూల్‌ను తామింకా విలువైన మిత్రపక్షంగా పరిగణిస్తామని మమత లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత్వంతో చర్చిస్తామని కాంగ్రెస్ తెలిపింది. తుది ఫలితం వచ్చే వరకూ ఆమె తమకు విలువైన మిత్రురాలేనని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేది వ్యాఖ్యానించారు.
ఆమె అభ్యంతరాలపై కాంగ్రెస్ చర్చిస్తుందని ఆయన చెప్పారు. కాగా, న్యాయమంత్రి సల్మాన్ ఖుర్షీద్ కూడా మమతను పొగడ్తల్లో ముంచెత్తారు. యూపిఏ కూటమికి ఆమె విలువైన సేవలు అందించారన్నారు. కాంగ్రెస్‌తో ఆమెకు సుదీర్ఘబంధం ఉందని, విభేదాలపై చర్చించడానికి అనేక మార్గాలున్నాయని, దేశంలో ఆమె అనిశ్చితి సృష్టించరని భావిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. కాగా కేంద్రం తన నిర్ణయాలు అన్నింటిని వెనక్కి తీసుకుంటే తాము మద్దతుపై పునరాలోచిస్తామని మమత మద్దతు ఉపసంహరణ ప్రకటన చేసినప్పుడు చెప్పిన విషయం తెలిసిందే.
మరోవైపు కాంగ్రెస్‌కు మిత్ర పక్షం డిఎంకే అధినేత కరుణానిధి షాకిచ్చారు. విపక్షాలు గురువారం తలపెట్టిన భారత్ బంద్‌కు మద్దతిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. డీజిల్ ధరల పెంపు, గ్యాస్ సిలిండర్లపై పరిమితి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి వంటి నిర్ణయాలపై మండిపడ్డారు.
తమకు ఏమాత్రం చెప్పకుండానే కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం అసంతృప్తి కలిగించిందనీ.. అందుకే బంద్‌కు మద్దతివ్వనున్నట్లు ప్రకటించారు. తమ పార్టీకి చెందిన కార్మిక సంఘాలన్నీ ఈ బంద్‌లో పాల్గొంటాయని.. కేంద్రానికి వ్యతిరేకంగా తమ పార్టీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు, ధర్నాలు చేపడతారని పేర్కొన్నారు. కేంద్రం ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కరుణ విజ్ఞప్తి చేశారు.