ఎలా ప్రకటించారు:తెలంగాణపై ప్రధానికి నారాయణమూర్తి

తెలంగాణపై కదలిక వచ్చింది... నారాయణ
కేంద్రంలో తెలంగాణపై కదలిక వచ్చిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వేరుగా అన్నారు. ఈసారి తాయిలాలతో ఎవరినీ కాంగ్రెసు పెద్దలు మభ్య పెట్టలేరన్నారు. తెలంగాణపై కాంగ్రెసు తన నిర్ణయాన్ని వెంటనే తెలియజేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై జాప్యం సరికాదన్నారు. ప్రజల ఆకాంక్షను పరిగణలోకి తీసుకొని కేంద్రం వెంటనే తెలంగాణ ప్రకటించాలని సూచించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు నోటీసులు అందుకున్న మంత్రులు సమస్య తమ మీదకు వచ్చేసరికి తిరుగుబాటు చేస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను అరెస్టు చేసినప్పుడు వారు ఎందుకు మౌనం వహించారని ప్రశ్నించారు.
కాగా అంతకుముందు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ విపక్షాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపు మేరకు ఎంజిబిఎస్ వద్ద రాస్తారోకో నిర్వహిస్తోన్న నారాయణను పోలీసులు అరెస్టు చేశారు. నారాయణ ఆధ్వర్యంలో సిపిఐ కార్యకర్తలు ఎంజిబిఎస్ చేరుకుని బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి నారాయణతోపాటు సిపిఐ కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications