వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి, అనుమానాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Harsha Maddula
చికాగో: అమెరికాలోని చికాగోలో అదృశ్యమైన ఓ తెలుగు విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. వారం రోజుల క్రితం అదృశ్యమైన హర్ష మద్దుల అనే తెలుగు విద్యార్థి శవమై కనిపించాడు. మృతుడు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందినవాడు. చికాగోలోని నార్త్‌వెస్ట్రన్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్ చదువుతున్నాడు.

హర్ష మృతితో నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయం ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించింది. పోలీసులు హర్ష కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు విల్మెంట్ హార్బర్‌లో హర్ష మృతదేహం లభ్యమైంది. తమ కుమారుడి మృతికి హర్ష తల్లిదండ్రులు ధనలక్ష్మి, ప్రసాద్ కన్నీరు మున్నీరవుతున్నారు.

అదృశ్యమైన హర్ష కోసం అమెరికా తెలుగు సంఘం (ఆటా) వివిధ మార్గాల్లో తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. మిత్రులు, వివిధ సంస్థలు, ఏజెన్సీలు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. విశ్వవిద్యాలయంలోని అతని మిత్రులు హర్షను చివరిసారిగా గత శుక్రవారం రాత్రి చూశారు.

అతని మిత్రులు, సహ విద్యార్థులు సరిగా సహకరించలేదని, మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదని ఆటా ప్రతినిధులు అంటున్నారు. ఈ మేరకు ఓ విజ్ఞప్తి పత్రం రాసి అందరికీ పంపించారు. ధనలక్ష్మి, ప్రసాద్ మద్దుల పేరు మీద తమ 18 ఏళ్ల కుమారుడి గాలింపు కోసం ఓ పిటిషన్ కూడా పెట్టారు. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి హర్ష కనిపించ లేదని అన్నారు. తమకు సహకరించాలని వారు వైట్‌హౌస్‌కు విజ్ఞప్తి చేసుకున్నారు.

English summary
A Telugu student Harsha Maddula died in Chicago of USA, He is studing medicie in North Western Unicersity. It is 6 days since Harsha Maddula is Missing. Even FBI, University Police, Private agencies are searching but no progress. The University and Students who last saw Harsha on Friday Night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X