అమెరికాను ఠారెత్తిస్తున్న శాండీ: 10మంది మృతి

Storm Sandy makes landfall: Ten dead
న్యూయార్క్: అమెరికాను వణికిస్తున్న శాండీ తుఫాను ప్రభావం దాదాపు 50 మిలియన్ మంది ప్రజల పైన పడింది. శాండీ తుఫాను అతలాకుతలం చేస్తుండటంతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి రోమ్నీ తమ ప్రచారాన్ని వాయిదా వేసుకున్నారు. ఒబామా నిత్యం అధికారులతో సమావేశం నిర్వహిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు విషయాలను తెలుసుకుంటున్నారు. ఎమర్జెన్సీని కూడా ప్రకటించారు.

శాండీ తుఫాను ప్రభావం అమెరికాలోని 12 రాష్ట్రాలలో పడింది. అరవై వేల మంది సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. శాండీ కారణంగా అమెరికాలో 10 మంది మృతి చెందారు. న్యూజెర్సీలో ఇద్దరు మృతి చెందారు. పలు ప్రాంతాల్లో అలలు 30 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. గాలులు గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. న్యూయార్క్ లో నాలుగు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేశారు. న్యూయార్క్ సిటిలోని పలు ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. ఈస్ట్, హడ్సన్ నదులు పొంగిపొర్లుతున్నాయి. అమెరికాకు దాదాపు తొమ్మిది వేల విమాన సర్వీసులు రద్దయ్యాయి. తీర ప్రాంతాల్లో అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. వాల్ స్ట్రీట్‌తో సహా పలు బిజినెస్ సెంటర్లు మూతపడ్డాయి. 12 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించారు. ఆగ్నేయ దిశలో తుఫాన్ ఏర్పడింది. న్యూజెర్సీ, వర్జీనియా, మేరీలాండ్ తదితర ప్రధాన నగరాలు ప్రభావితమయ్యాయి.

పలు ప్రాంతాలలో ఒబామా ముందస్తు చర్యలకు ఆదేశించారు. దాదాపు 15 లక్షల ఇళ్లు పాక్షికంగా, పూర్తిగా దెబ్బతిన్నాయి. అమెరికా చరిత్రలో ఇదే అతిపెద్ద తుఫాను కావడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+